అతడి నిమజ్జనం ఇంకా మిగిలే ఉంది: ప్రకాశ్ రాజ్
Advertisement

అతడి నిమజ్జనం ఇంకా మిగిలే ఉంది: ప్రకాశ్ రాజ్

Prakash Raj says CEC immersion is still pending
  • జ్ఞానూ 'విసర్జన్' జరగాలన్న ప్రకాశ్ రాజ్
  • సర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణ
  • సీఈసీ వైదొలిగేంత వరకు పోరాడాలని పిలుపు
ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దేశంలో గణేశుడి నిమజ్జనం పూర్తయిందని, కానీ జ్ఞానూ నిమజ్జనం ఇంకా మిగిలే ఉందని సీఈసీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసనలకు ఆయన మద్దతు పలికారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ వంటివి ఢిల్లీ, ముంబైలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయని.. ఈ శాంతియుత నిరసనల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని, సీఈసీ వైదొలిగే వరకు పోరాడాలని ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు.

ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ సవరణ ప్రక్రియ విషయంలో మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా పలుమార్లు అభ్యంతరాలు తెలిపినట్లు వార్తలు రావడం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 700 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోనూ భారీగా పోలీసులు మోహరించారు.
Advertisement
Prakash Raj
Gyanesh Kumar
Election Commission of India
Voter List Revision
CEC Resignation Demand
Jantar Mantar Protests

More Telugu News