విమానం కాక్‌పిట్‌లో ఎప్పుడూ ఇద్దరు పైలట్లు ఎందుకుండాలి?.. విమానయాన రూల్స్ మార్చిన ప్రమాదాలివే!
- ఫ్లైదుబాయ్ ఘటనతో కాక్‌పిట్ భద్రతపై మళ్లీ చర్చ
- 2026 మేలో ఈఏఎస్‌ఏ మార్గదర్శకాల సవరణ
- పెద్ద వాణిజ్య విమానాల్లో ఇద్దరు ఉండటానికి ప్రాధాన్యం
- ఒక పైలట్ బయటకు వెళితే మరో వ్యక్తి లోపల ఉండాలి
- కాక్‌పిట్‌లో పైలట్ స్పృహ కోల్పోయినా ఇది ప్రయోజనకరం
విమానంలో వందల మంది ప్రయాణికులు ఉంటారు. వారందరి భద్రత బాధ్యత కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లదే. కానీ అదే కాక్‌పిట్‌లో ఒక పైలట్ ఒంటరిగా మిగిలితే? అతడే ప్రమాదానికి కారణమైతే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం విమానయాన రంగం గతంలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలను పదేపదే పరిశీలించింది. ఈజిప్ట్‌ఎయిర్ 990, జర్మన్‌వింగ్స్ 9525 ప్రమాదాలు ఈ విషయంలో కీలకంగా మారాయి.
1999లో తొలి హెచ్చరిక
1999 అక్టోబర్ 31న ఈజిప్ట్‌ఎయిర్ 990 విమానం న్యూయార్క్ నుంచి కైరోకు బయలుదేరింది. విమానం 33 వేల అడుగుల ఎత్తులో ఉండగా కెప్టెన్ కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రిలీఫ్ ఫస్ట్ ఆఫీసర్ గేమీల్ అల్ బటౌటీ ఒంటరిగా మిగిలారు.
కొద్దిసేపటికే విమానం అకస్మాత్తుగా కిందికి దిగడం మొదలైంది. కెప్టెన్ తిరిగి వచ్చి విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు పైలట్లు భిన్న దిశల్లో నియంత్రణ చర్యలు చేపట్టారు. చివరకు విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలింది. అందులో ఉన్న 217 మంది చనిపోయారు.
అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్‌టీఎస్‌బీ.. ఫస్ట్ ఆఫీసర్ నియంత్రణ చర్యలే ప్రమాదానికి కారణమని తేల్చింది. అయితే అతను అలా ఎందుకు చేశాడన్నది మాత్రం నిర్ధారించలేదు. ఈజిప్ట్ దర్యాప్తు బృందం మాత్రం విమానంలో యాంత్రిక లోపం ఉందని వాదించింది.
2015లో మరో విషాదం
ఈ ఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాత జర్మన్‌వింగ్స్ 9525 ప్రమాదం జరిగింది. 2015 మార్చి 24న బార్సిలోనా నుంచి డ్యూసెల్‌డార్ఫ్ వెళుతున్న ఎయిర్‌బస్ ఏ320లో కెప్టెన్ కాసేపు కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లారు.
ఆ సమయంలో కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ లోపలే ఉన్నారు. ఆయన విమానం ఆటోపైలట్ సెట్టింగ్‌ను మార్చి క్రమంగా కిందికి దింపడం ప్రారంభించారు. కెప్టెన్ తిరిగి కాక్‌పిట్‌లోకి రావడానికి ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు.
విమానం ఫ్రెంచ్ ఆల్ప్స్‌ను ఢీకొంది. 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తులో లూబిట్జ్ కావాలనే విమానాన్ని కూల్చినట్లు తేలింది.
అప్పుడే మారిన నిబంధన
ఈ ప్రమాదం తర్వాత కాక్‌పిట్‌లో పైలట్ ఒంటరిగా ఉండటం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. మూడు రోజుల్లోనే యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ కీలక సూచన చేసింది. ప్రయాణ సమయంలో కాక్‌పిట్‌లో కనీసం ఇద్దరు సిబ్బంది ఉండాలని పేర్కొంది.
ఒక పైలట్ బయటకు వెళ్లాల్సి వస్తే మరో అర్హత కలిగిన సిబ్బంది లోపలికి రావాలి. ఉద్దేశం ఒక్కటే. కాక్‌పిట్‌లో ఒక వ్యక్తి మాత్రమే ఉండకుండా చూడటం.
మళ్లీ మారిన విధానం
అయితే ఈ నిబంధన ఎక్కువకాలం అన్ని చోట్ల ఒకేలా అమల్లో లేదు. కాక్‌పిట్ తలుపును తరచూ తెరవాల్సి రావడం మరో భద్రతా సమస్యకు దారితీయొచ్చన్న ఆందోళనలు వచ్చాయి. దీంతో 2016లో ఈఏఎస్‌ఏ రిస్క్ ఆధారిత విధానానికి మారింది.
2026 మేలో మాత్రం ఈఏఎస్‌ఏ మరోసారి మార్గదర్శకాలను సవరించింది. సురక్షిత కాక్‌పిట్ తలుపులు ఉన్న పెద్ద వాణిజ్య విమానాల్లో ప్రయాణ సమయంలో ఇద్దరు అనుమతిపొందిన వ్యక్తులు లోపల ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చింది.
ఇందులో మరో అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. కాక్‌పిట్‌లో ఒంటరిగా ఉన్న పైలట్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చు. మరో వ్యక్తి లోపల ఉంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఫ్లైదుబాయ్ ఘటనతో కాక్‌పిట్ భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. బయట నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడంతో పాటు.. కాక్‌పిట్‌లోనే ఎదురయ్యే ప్రమాదాలను నివారించడమూ విమాన భద్రతలో కీలకంగా మారింది.