ట్రంప్‌కు జై కొట్టినా.. భారత సంతతికి తప్పని అవమానాలు!
- ట్రంప్‌కు మద్దతిస్తున్న భారత సంతతికి జాత్యహంకార వ్యాఖ్యలు
- భావజాలం కన్నా జాతే ముఖ్యమంటున్న కొందరు ట్రంప్ మద్దతుదారులు
- భారత సంతతి నేత హర్మీత్ థిల్లాన్‌పై సొంత వర్గం నుంచే దాడి
- గతంలో ప్రోగ్రెసివ్‌లకే పరిమితమైన దాడులు.. ఇప్పుడు కన్జర్వేటివ్‌లపైనా
- "అసలైన అమెరికన్" అని నిరూపించుకోవాల్సిన దుస్థితి
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఆయన 'మాగా' (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఉద్యమానికి గట్టి మద్దతుదారులుగా ఉన్న భారత సంతతి కన్జర్వేటివ్‌లకు ప్రస్తుతం అనూహ్య అనుభవాలు ఎదురవుతున్నాయి. తమ భావజాలం తమను అమెరికన్‌లుగా పూర్తిస్థాయిలో గుర్తిస్తుందని వారు భావిస్తున్నప్పటికీ, వారిలో కొందరు సొంత పార్టీ నుంచే జాత్యహంకార వ్యాఖ్యలను, వివక్షను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ రాజకీయాల్లో భావజాలానికే ప్రాధాన్యత ఉంటుందని, జాతి, మూలాలకు తావుండదని చాలా మంది భారతీయ-అమెరికన్లు విశ్వసించారు. అయితే, ఇటీవలి పరిణామాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. వారు భావజాల పరంగా తమ నిబద్ధతను చాటుకున్నప్పటికీ, "మీరు ఎంతవరకు అమెరికన్లు?" అనే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రముఖ కాలమిస్ట్ చిదానంద్ రాజఘట్ట తన కథనంలో విశ్లేషించారు.
ట్రంప్ ప్రభుత్వంలో పనిచేస్తున్న చండీగఢ్ మూలాలున్న హర్మీత్ థిల్లాన్, తనను తాను అమెరికన్‌గా చాటుకునేందుకు బీఫ్ డిన్నర్ ఫొటో పోస్ట్ చేశారు. దీనిపై 'మాగా' మద్దతుదారులే ఆమెను ఎగతాళి చేశారు. తనను 'పేపర్‌వర్క్ అమెరికన్' అంటూ రోజూ జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నానని ఆమె స్వయంగా తెలిపారు. అలాగే, దినేశ్ డిసౌజా తన కుమార్తెపై వచ్చిన జాతి వివక్ష దాడిని తిప్పికొట్టేందుకు, ఆమె తల్లి శ్వేతజాతీయురాలని చెప్పాల్సి రావడం విమర్శలకు దారితీసింది. గతంలో వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ వంటి వారు కూడా తమ అమెరికన్ గుర్తింపును నిరూపించుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది.
సాధారణంగా ప్రగతిశీల భావాజాలం కలిగిన ప్రమీలా జయపాల్ వంటి నేతలు 'మీ దేశానికి తిరిగి వెళ్లండి' వంటి విమర్శలను మొదటి నుంచీ ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు ట్రంప్ వాదాన్ని అత్యంత బలంగా వినిపిస్తిన్న కన్జర్వేటివ్‌లు సైతం అదే వర్గం నుంచి ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం గమనార్హం.