గ్యాస్ పైపును ఎన్నేళ్లకు ఓసారి మార్చాలో తెలుసా?
- పగుళ్లు, కోతలు ఉంటే గ్యాస్ పైపు వెంటనే మార్చాలి
- సాధారణ రబ్బరు ట్యూబ్‌ను రెండేళ్లకు మార్చాలని హెచ్‌పీసీఎల్ సూచన
- సురక్షా ఎల్‌పీజీ హోస్‌కు ఐదేళ్ల వరకు గడువు
- పైపుపై ఉన్న మార్పిడి తేదీని తప్పక పరిశీలించాలని సూచన
- బీఐఎస్/ఐఎస్‌ఐ ప్రమాణాలున్న పైపులనే ఎంచుకోవాలని హితవు
వంటగదిలో గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్‌పై అందరూ దృష్టి పెడతారు. కానీ వాటిని కలిపే గ్యాస్ పైపును మాత్రం చాలామంది పట్టించుకోరు. ఏళ్ల తరబడి వాడుతున్న పైపు బయటకు బాగానే కనిపించినా లోపల దెబ్బతిని ఉండొచ్చు. అందుకే దాని పరిస్థితిని తరచూ పరిశీలించడం చాలా ముఖ్యం.
ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త
వేడి, రాపిడి, తేమతో పాటు ఎలుకలు కొరకడం వల్ల పైపు దెబ్బతినే అవకాశం ఉంది. పగుళ్లు, కోతలు, గట్టిపడటం, కాలిన మచ్చలు కనిపిస్తే వెంటనే మార్చాలి. కనెక్షన్ల దగ్గర కూడా దెబ్బతిన్న ప్రాంతాలు ఉన్నాయేమో చూడాలి. నిర్ణీత గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
పైపు గడువు ఎంత?
ఇండియన్‌ఆయిల్ తెలిపిన వివరాల ప్రకారం బీఐఎస్ ఆమోదం పొందిన తయారీదారులు తయారు చేసే సురక్షా ఎల్‌పీజీ హోస్‌కు ఐదేళ్ల వరకు గడువు ఉంటుంది. అయితే అన్ని పైపులకు ఇదే గడువు ఉండదు. హెచ్‌పీసీఎల్ సూచనల ప్రకారం సాధారణ రబ్బరు ట్యూబ్‌ను రెండేళ్లకు ఒకసారి మార్చాలి. మీ వద్ద ఉన్న పైపు రకం, దానిపై ఉన్న మార్పిడి తేదీని తప్పక పరిశీలించాలి.
నాణ్యత విషయంలో రాజీ వద్దు
చౌకగా దొరుకుతుందని ఏ పైపులు పడితే అవి కొనకూడదు. బీఐఎస్/ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉన్న పైపునే ఎంచుకోవాలి. వీలైతే అధీకృత ఎల్‌పీజీ డీలర్ నుంచి తీసుకోవడం మంచిది. సురక్షా హోస్‌లో బహుళ పొరల నిర్మాణం, మెటల్ వైర్ బ్రేడింగ్ ఉంటాయి.
మార్చేటప్పుడు జాగ్రత్త
పైపు మార్చే ముందు రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. సరైన పరిమాణంలో ఉన్న కొత్త పైపును స్టవ్, రెగ్యులేటర్‌కు బిగించాలి. కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయో నిర్ధారించుకోవాలి. గ్యాస్ వాసన వస్తే మంట వెలిగించకూడదు. సిగరెట్, అగ్గిపెట్టె, లైటర్‌కు దూరంగా ఉండాలి. విద్యుత్ స్విచ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయకూడదు. సురక్షితంగా ఉంటే తలుపులు, కిటికీలు తెరిచి అందరూ బయటకు రావాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎల్‌పీజీ హెల్ప్‌లైన్ 1906కు సమాచారం ఇవ్వాలి.
రెగ్యులేటర్‌పైనా కన్నేయాలి
స్టవ్ వాడని సమయంలో రెగ్యులేటర్ నాబ్‌ను ఆఫ్‌లో ఉంచాలని ఇండియన్‌ఆయిల్ సూచిస్తోంది. ఐదేళ్లకు ఒకసారి ఎల్‌పీజీ ఇన్‌స్టలేషన్‌కు సేఫ్టీ ఆడిట్ చేయించుకోవాలి. కొత్త సిలిండర్ తీసుకున్నప్పుడు సీల్, సేఫ్టీ క్యాప్, వాల్వ్‌ను పరిశీలించాలి. చిన్నపిల్లలను వంట సమయంలో గ్యాస్ స్టవ్, సిలిండర్‌కు దూరంగా ఉంచాలి.