ఓటీటీ స్క్రీన్ పైకి విశాల్ యాక్షన్ థ్రిల్లర్!
- విశాల్ హీరోగా రూపొందిన 'మకుటం'
- తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం
- కథానాయికలుగా అంజలి - దుషారా విజయన్
- ఆగస్టు 14న విడుదలైన సినిమా
- సెప్టెంబర్ 4 నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో
విశాల్ కి మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ ఎక్కువ. తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోను ఆయనకి మాస్ ఫ్యాన్స్ ఎక్కువే. విశాల్ తన సినిమాలలో యాక్షన్ .. ఎమోషన్ రెండూ ఉండేలా చూసుకుంటాడు. మాస్ టచ్ తో సాగే ఆయన సినిమాలకు ఓటీటీలలోను మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రీసెంటుగా ఆయన చేసిన ఒక సినిమా 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ వేదికపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'మకుటం'. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా, సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
విశాల్ కి మాస్ యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం పుష్కలంగా ఉంది. అలాగే కథ .. స్క్రీన్ ప్లే విభాగాలపై కూడా ఆయనకి అవగాహన ఉంది. అందువలన ఆయన దర్శకుడిగా మారిపోయి తెరకెక్కించిన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఈ రెండు పాత్రల సరసన నాయికలుగా అంజలి - దుషారా విజయన్ అలరించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే టాక్ వచ్చింది.
కథలోకి వెళితే .. కృపాకర్ ఒక చిన్నపాటి జాబ్ చేసుకుంటూ, భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు. ఒకసారి సరదాగా వాళ్లను తీసుకుని విహారానికి వెళతాడు. అక్కడ కొంతమంది రౌడీలు అతని కారుపై దాడి చేస్తారు. ఆ ఘటనలో కృపాకర్ భార్యాబిడ్డలు చనిపోతారు. అప్పుడు కృపాకర్ ఏం చేస్తాడు? అతని ఫ్యామిలీపై దాడి చేసింది ఎవరు? ఆ గ్యాంగ్ వెనకున్న నాయకుడు ఎవరు? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొడుతుందో చూడాలి మరి.