తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతంటే?
- స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దిగి వస్తున్న పసిడి
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,280
- కిలోకు వంద రూపాయలు తగ్గిన వెండి ధర
- హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,89,900గా నమోదు
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, గురువారం ఉదయం నాటికి హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,280 వద్ద నమోదైంది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,090గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,430 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,240 పలికింది.
మరోవైపు వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.2,84,900 కాగా, బెంగళూరులో రూ.2,85,100గా నమోదైంది.