ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలు.. మల్లికార్జున ఖర్గే చురక
- మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు మోదీ సూచనలు
- ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయని వ్యాఖ్య
- బీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గే
దేశ ప్రజలకు అధిక ఉష్ణోగ్రతల కంటే, ద్రవ్యోల్బణం కారణంగానే చెమటలు పడుతున్నాయని చురక అంటించారు. ప్రజలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దోచుకుంటోందని, కానీ దీనిపై ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. "మేం ఎండవేడిని తట్టుకోగలం. కానీ బీజేపీ ప్రాయోజిత ద్రవ్యోల్బణం అనే మంటల వల్ల సామాన్య ప్రజలకు చెమటలు పడుతున్నాయి. మీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ గురించి మీరెందుకు మాట్లాడటం లేదు మోదీజీ?" అని ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.