సోషల్ మీడియా వేదికగా సీపీ సజ్జనార్‌కు అనసూయ ఫిర్యాదు
- ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు
- ఇలాంటి వాటిని పట్టించుకోవద్దనుకున్నానన్న అనసూయ
- కానీ తరుచూ తన ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు
ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని తాను ప్రయత్నించానని ఆమె పేర్కొన్నారు. కానీ ఈ 'ఎక్స్' హ్యాండిల్ ద్వారా తరచూ తన ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అనసూయ ఫిర్యాదుపై సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయమని సూచించారు. సమన్వయం చేసుకోవాలంటూ 'హైదరాబాద్ సిటీ పోలీస్' ఖాతాను సజ్జనార్ ట్యాగ్ చేశారు.