మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు
- ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
- ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు
- ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు
అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత రియల్టర్లకు ధారాదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.