హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
- ప్రధాని మోదీ పొదుపు మంత్రం పిలుపు మేరకు నిర్ణయం
- కస్టమర్లతో నేరుగా సంబంధం లేని బ్యాంకింగ్ సేవల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
- నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత నిర్ణయం
కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్‌లకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు తెలిపింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే దీనిని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఆ తర్వాత పనితీరును బట్టి కొనసాగించాలా లేదా అనే నిర్ణయం ఉంటుందని తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీలోని ట్రెజరీ ఆపరేషన్స్, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్, హెచ్ఆర్ డిపార్టుమెంట్, ఫైనాన్స్ అకౌంట్స్ వంటి అంతర్గత విభాగాల ఉద్యోగులకు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్తిస్తుంది. కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్తించదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వినియోగదారులకు బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది.