పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు
- వాట్సాప్ ద్వారా ఎంతోమందికి చేరువ కావొచ్చన్న కేంద్రమంత్రి
- పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు
- త్వరలో యూపీఐ ద్వారా ఉపసంహరణకు అవకాశం
పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోచ్చు. గ్రీన్ టిక్ మార్కు కలిగిన ఈపీఎఫ్ఓ వాట్సాప్ నెంబర్‌కు 'హలో' అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. యూఏఎన్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా ఈ సేవలు లభిస్తాయి. ఈపీఎఫ్ఓకు సంబంధించిన సందేశాలు కూడా స్థానిక భాషల్లో ఎప్పటికప్పుడు అందుకోవచ్చు.
ఆటోమేటెడ్ సిస్టం ద్వారా వాట్సాప్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నెల రోజుల్లోపు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరోవైపు, యూపీఐ ద్వారా పీఎఫ్ నిల్వలను ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి తెలిపారు. లావాదేవీలు నిర్వహించేందుకు యూపీఐ పిన్ అవసరమవుతుందని అన్నారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే 7 కోట్లమంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి అన్నారు.