అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ!
- గత ఏడాది డిసెంబర్లో విడుదలైన అవతార్-3
- జూన్ 24న డిస్నీప్లస్ వేదికగా స్ట్రీమింగ్
- అదే రోజున భారత్ లో జియో స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం
అవతార్-3 చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంటల్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. జూన్ 24వ తేదీ నుంచి సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా సినిమాను వీక్షించవచ్చు.
అవతార్-3 భారతదేశంలో జూన్ 24వ తేదీనే జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం తదితర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంలో ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రకటన రావాల్సి ఉంది.