టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు
- పురపాలక నియామకాల స్కాంలో అదుపులోకి తీసుకున్న ఈడీ
- గంటల తరబడి విచారణకు సహకరించకపోవడంతో చర్యలు
- 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని ప్రధాన ఆరోపణ
- అక్రమ ఆస్తులు గుర్తించామని ఈడీ ప్రకటన
సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బు తీసుకుని దాదాపు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని సుజిత్ బోస్‌పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా ఆయన ఫ్లాట్లు, భారీ నగదు డిపాజిట్లు పొందినట్టు ఆధారాలు గుర్తించామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఉదయం తన కుమారుడితో కలిసి విచారణకు హాజరైన సుజిత్ బోస్‌ను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. సుజిత్ బోస్‌ను మంగళవారం పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచి, కస్టడీ కోరనున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో కూడా ఈడీ అధికారులు సుజిత్ బోస్ నివాసంలో సోదాలు నిర్వహించారు.