పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలని మోదీ పిలుపు... స్పందించిన కేంద్రమంత్రులు
- విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ఖర్చులు తగ్గించుకోవాలన్న అశ్వినీ వైష్ణవ్
- ప్రయాణాల్లో ప్రజారవాణాను వినియోగించాలన్న నితిన్ గడ్కరీ
- ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో మోదీ ఇచ్చిన పిలుపు ఉపకరిస్తుందన్న రాజ్‌నాథ్
ఈ నేపథ్యంలో ప్రజలు విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ప్రతి ఖర్చును తగ్గించుకోవడం అవశ్యమని అన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించుకోవడానికి మన ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. దానిని కాపాడుకోవడంతో పాటు మరింత సంపాదించాలని అన్నారు. ఈ రెండు పనులు సమాంతరంగా జరగాలని సూచించారు.
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోదీ పిలుపునిచ్చారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రయాణాల్లో భాగంగా ప్రజారవాణాను వినియోగించాలని సూచించారు. ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో ప్రయాణించడాన్ని నివారించాలని కోరారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో, ప్రపంచ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉపకరిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.