అసోం ముఖ్యమంత్రిగా మళ్లీ హిమంత బిశ్వ శర్మ
- అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ
- మే 12న గౌహతిలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం
- బీజేపీ, ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
- అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఈ పరిణామం
ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోట ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు, హిమంత బిశ్వ శర్మ రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు.
ఆదివారం గౌహతిలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో హిమంతను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా హిమంత పేరును నడ్డా ప్రకటించారు. అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) వంటి మిత్రపక్షాలు కూడా ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపాయి.
ఇటీవల ముగిసిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.