తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్
- ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న శివధర్ రెడ్డి
- సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- హైదరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్
ఈ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. సీవీ ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన హైదరాబాద్ సీపీగా, ఏసీపీ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇకపై ఆయన రాష్ట్ర పోలీస్ బాస్ గా నూతన బాధ్యతలు చేపడతారు.