దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు
- 14 మిలియన్లకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్న పెజెష్కియాన్
- పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
- ఇరాన్ కోసమే నిలబడ్డాను.. నిలబడతానని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని అన్నారు. ఇరాన్ కోసమే నిలబడ్డాను, ఇక ముందు కూడా నిలబడతానని పేర్కొన్నారు.
ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశంలోని అనేక స్థావరాలను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈసారి డెడ్‌లైన్ పొడిగింపు ఉండదని, ఇరాన్‌ను తమ బలగాలు ఒక్క రాత్రికే తుడిచి పెట్టేయగలవని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ధీటుగా స్పందించారు. అమెరికా తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని, తమ శాశ్వత డిమాండ్లు అంగీకరించాలని చెబుతోంది. తాను, తమ దేశ ప్రజలు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.