రోహిత్ శర్మ, కోహ్లీల భవిష్యత్తుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై స్పష్టతనివ్వాలన్న యువరాజ్
- ఆటగాళ్లతో యాజమాన్యం బహిరంగంగా చర్చించాలని సూచన
- తన తండ్రి వ్యాఖ్యలపై ధోనీ, కపిల్ దేవ్‌కు క్షమాపణ చెప్పిన యువీ
- భారత క్రికెట్‌లో నిజాయతీగా మాట్లాడే సంస్కృతి లేదని వ్యాఖ్య
ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ, "వారి మనసులో ఏముందో నాకు తెలియదు. వరల్డ్ కప్ ఆడాలని వారు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే తుది నిర్ణయం సెలక్టర్లదే" అని యువరాజ్ చెప్పాడు. ఆటగాళ్లతో మేనేజ్ మెంట్ కూర్చుని బహిరంగంగా చర్చించాలని, ఇలాంటి సంభాషణలు కష్టమైనప్పటికీ జట్టు భవిష్యత్తుకు అవసరమని సూచించాడు. "భారత క్రికెట్‌లో ముఖం మీదే నిజం చెప్పే సంస్కృతి లేదు. కానీ ఏడాది తర్వాతైనా, నిజం చెప్పినందుకు ఆటగాళ్లు సంతోషిస్తారు" అని యువీ పేర్కొన్నాడు.
ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరగా, రోహిత్ కూడా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న 2027 ప్రపంచకప్ కోసం భారత జట్టు సన్నాహాలు మొదలుపెట్టిన తరుణంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.