ఇరాన్‌తో యుద్ధం వేళ.. అమెరికా సైన్యంలో సంచలనం!
- యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌పై వేటు
- తక్షణమే పదవి వీడాలని ఆదేశించిన రక్షణ మంత్రి పీట్ హెగ్‍సెత్
- ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న కీలక తరుణంలో ఈ పరిణామం
- ట్రంప్ విజన్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయమని విశ్లేషణలు
- యాక్టింగ్ చీఫ్‌గా జనరల్ క్రిస్టోఫర్ లానేవ్ నియామకం
అయితే, జార్జ్‌ను అర్ధాంతరంగా తొలగించడానికి గల కచ్చితమైన కారణాలను పెంటగాన్ వెల్లడించలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వం సైన్యంలో ఉండాలని హెగ్‍సెత్ భావిస్తున్నారని, అందుకే ఈ మార్పులు చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా నాలుగేళ్ల పదవీకాలం ఉండగా, 2023లో బాధ్యతలు చేపట్టిన జార్జ్ కేవలం 18 నెలల్లోనే వైదొలగాల్సి వచ్చింది.
గతేడాది హెగ్‍సెత్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సైన్యంలో ఉన్నతస్థాయి అధికారుల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆయన డజనుకు పైగా ఉన్నతాధికారులను పదవుల నుంచి తప్పించారు. జార్జ్ స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ క్రిస్టోఫర్ లానేవ్ యాక్టింగ్ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. లానేవ్ గతంలో హెగ్‍సెత్‌కు టాప్ మిలిటరీ ఎయిడ్‌గా పనిచేయడం గమనార్హం. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల్లో పనిచేసిన అనుభవజ్ఞుడైన జార్జ్‌ను తొలగించడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.