భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- నిన్నటి ముగింపుతో 900 పాయింట్ల భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్
- 72,262 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్
- డాలర్ మారకంతో రూపాయి బలోపేతం
సూచీలు 185 పాయింట్లు లాభపడి 73,319 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33.70 పాయింట్ల లాభంతో 22,713 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 157 పైసలు కోలుకుని 93.13గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌స్ బ్యాంకు స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పేయింట్స్, ఎటర్నల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.