మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి
- రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి
- రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఈరోజు రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.51 లక్షలు పలుకుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే సంకేతాలకు తోడు, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు బంగారం, వెండి ధరల భారీ పెరుగుదలకు కారణమైంది.
ఇదిలా ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 61 శాతం పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ 1న 10 గ్రాముల బంగారం ధర రూ.94,150గా ఉండగా ఇప్పుడు రూ.1,51,000 దాటింది. ఏడాది కాలంలో బంగారం రూ.57 వేలకు పైగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం ఒకానొక సమయంలో రూ.1,70,000 దాటింది. కిలో వెండి ధర గత ఏడాది ఏప్రిల్ 1న రూ.1.34 లక్షలుగా ఉండగా, ఏడాది కాలంలో రూ.1 లక్షకు పైగా పెరిగింది. ఒకానొక సమయంలో వెండి కిలో రూ.4 లక్షలు దాటింది.