వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర
- పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరలు
- ఢిల్లీలో రూ. 2,078కి చేరిన 19 కిలోల సిలిండర్
- హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణమని చమురు సంస్థలు వెల్లడించాయి. ఈ తాజా పెంపుతో కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,208కి ఎగబాకింది. గత నెల, అంటే మార్చి 1వ తేదీన కూడా కమర్షియల్ సిలిండర్‌పై రూ. 114.5 పెంచిన విషయం తెలిసిందే. నెల తిరిగేసరికి మరోసారి ధరలు పెరగడం గమనార్హం. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.