సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం
- ఎనిమిదోసారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులేదు
- సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 8.2 శాతం కొనసాగింపు
- 7.1 శాతంగానే పీపీఎఫ్ వడ్డీ రేటు
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) పథకం కింద చేసే డిపాజిట్లకు 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. పీపీఎఫ్‌కు 7.1 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లలో మార్పులేదు.
పోస్టాఫీస్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. కిసాన్ వికాస్ పత్ర పథకానికి 7.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి 7.7 శాతం, పోస్టల్‌లో నెలవారీ ఆదాయ పథకంపై (ఎంఐఎస్) 7.4 శాతం వడ్డీ రేటు కొనసాగుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చివరిసారి 2023-24 నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేట్లను సవరించింది.