రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి
- మొదటిసారి 95 స్థాయికి పడిపోయిన రూపాయి
- ఉదయం 130 పైసలు లాభపడి కోలుకున్నట్లుగా కనిపించిన రూపాయి
- సెషన్ ముగిసేసరికి ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనం
రూపాయి బలహీనతకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యాలెర్‌కు 109 డాలర్లకు పైన ఉంది. దీనితో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
ఈ నెలలో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి సుమారు 11.5 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం సుమారు రూ.850 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు. ఇలా వివిధ కారణాలతో రూపాయి అత్యంత బలహీనమవుతోంది.