రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్
- సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన రామ్‌చరణ్
- కుడి కంటికి స్వల్పగాయం.. గాయానికి చికిత్స
- ఆందోళన అవసరం లేదన్న 'పెద్ది' టీమ్
రామ్‌చరణ్‌కు అయిన గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిమానులకు సూచించింది. ఈ గాయంపై ఎలాంటి అనవసర ప్రచారాలను నమ్మవద్దని కోరింది. ఈ గాయం నుంచి కోలుకుంటున్న రామ్‌చరణ్ రేపు చిత్రీకరణలో పాల్గొంటారని వెల్లడించింది.
రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుండగా స్వల్పగాయమైంది. గాయమైనచోట నాలుగు కుట్లు పడినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావిస్తున్నారు.