'సర్కే చునారే తేరీ సర్కే' పాట.. క్షమాపణలు చెప్పిన గాయని మంగ్లీ
- అసభ్యకర పదాలు ఉండటంపై తీవ్ర విమర్శలు
- ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పాటను తొలగించినట్లు వెల్లడి
- అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నానన్న మంగ్లీ
ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని, అయినప్పటికీ క్షమాపణలు కోరుతున్నానని సామాజిక మాధ్యమ వేదికగా పోస్టు పెట్టారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. లిరిక్స్లో మార్పులు చేశామని, ఈ పాట త్వరలో విడుదలవుతుందని వెల్లడించారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని పేర్కొన్నారు.