ఢిల్లీలో ఎదురుపడిన సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నాయకురాలు రోజా
- ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి
- నితిన్ గడ్కరీని కలవడానికి పార్లమెంటుకు వచ్చిన రోజా
- పార్లమెంట్ భవనంలో ఎదురుపడిన రేవంత్ రెడ్డి, రోజా
- షేక్ హ్యాండ్ ఇచ్చి పరస్పరం పలకరింపు
రోజాను పలకరించిన రేవంత్ రెడ్డి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో వెంట ఉన్న నాయకులు ఏదో ప్రశ్నించగా, తాను పని మీద వచ్చానని ఆమె సమాధానం చెప్పారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని రోజా పలకరించారు.