ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్ లో ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!
- మంటలు అంటుకుని పేలిన గ్యాస్ సిలిండర్లు
- ఎలక్ట్రానిక్ లాక్స్ మొరాయించడంతో లోపలే చిక్కుకుపోయిన బాధితులు
- ఈవీ ఛార్జింగ్‌పై కొత్త నిబంధనలు తెస్తామన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
క్షణాల్లోనే ఆ మంటలు భవనం మొత్తానికి వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 10 గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో మంటల తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భవనానికి ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ మొరాయించింది. దీంతో తలుపులు తెరుచుకోక బాధితులు బయటపడలేకపోయారు. లోపలే చిక్కుకుని పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
ఈ భవనం యజమాని మనోజ్ పుగాలియా పాలిమర్ వ్యాపారి కావడంతో ఇంట్లో పాలిమర్ మెటీరియల్ నిల్వ చేశారని, దాని వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌కు సంబంధించి నిపుణుల కమిటీతో విచారణ జరిపి, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.