వాళ్ల భాషలోనే జవాబిస్తాం.. పాక్ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్ల రియాక్షన్
- ఆసుపత్రిపై దాడి మానవత్వానికే మచ్చ అంటూ ఫైర్
- పాక్ క్రూరత్వానికి నిదర్శనం.. తాలిబన్ అధికార ప్రతినిధి
- అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని వెల్లడి
తాలిబన్ల ప్రతిస్పందన
ఈ అమానుష ఘటనపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. ‘‘పాకిస్థాన్‌కు వారి భాషలోనే (దెబ్బకు దెబ్బ) సమాధానం చెబుతాం’’ అని షాహీన్ హెచ్చరించారు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను యుద్ధ వాతావరణానికి దారితీశాయని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ దాడితో పాక్- ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి చోట్ల దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం ఆపాలని కోరారు.