మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు... ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి పాజిటివ్
- ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్.. బ్లడ్ టెస్ట్‌లో ఎంపీకి పాజిటివ్
- ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ గిరిధర్
- 11 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్
శనివారం రాత్రి 11 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ ఒక మహిళ సహా మొత్తం 11 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినప్పటికీ, తదుపరి రక్త పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఎస్పీ చెప్పారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ వినియోగించినట్లు శాస్త్రీయ ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.