ఆయిల్ పామ్ పంట వేయండి... మార్కెట్ సమస్య లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- సిద్దిపేట, జనగామ జిల్లాల్లో పర్యటించిన మంత్రి
- రైతులకు ఆయిల్ పామ్ అన్ని విధాలా లాభాలు ఇస్తుందన్న మంత్రి
- రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ అందిస్తున్నామని తెలిపారు. తాను మంత్రిగా వచ్చిన సమయానికి ఆయిల్ పామ్ టన్ను రూ.12 వేలు ఉండేదని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టన్ను ధర రూ.20 వేలకు పైగా పెంచామని చెప్పారు. నర్మెట్టలో త్వరలో రైతు మేళా నిర్వహిస్తామని అన్నారు.