జపాన్ సముద్ర జలాలవైపు ఉత్తర కొరియా క్షిపణి!
- పశ్చిమాసియా యుద్ధం వేళ అలజడి
- అమెరికా లక్ష్యంగా కిమ్ వ్యూహం
- తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన జపాన్
ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా తన బలగాలను మోహరించి యుద్ధంలో తలమునకలై ఉన్న తరుణంలో, అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్షిపణి ఎంత దూరం ప్రయాణించింది, అది ఏ రకమైన క్షిపణి అనే అంశాలపై దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి.
ఈ ప్రయోగం నేపథ్యంలో జపాన్ తన సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇరాన్‌కు రష్యా మరియు చైనా పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఉత్తర కొరియా ప్రయోగం అమెరికాకు కొత్త తలనొప్పిగా మారింది.