విశాఖకు చెందిన సైబర్ క్రైమ్ నేరస్తుడ్ని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
- మాట్రిమోని, క్రిప్టో పెట్టుబడుల పేరుతో మోసం
- నిందితుడిని విశాఖకు చెందిన ప్రసన్నకుమార్‌గా గుర్తించిన పోలీసులు
- కంబోడియా నుంచి వస్తుండగా చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రసన్నకుమార్ ఒక మ్యాట్రిమోనియర్ వెబ్ సైట్‌లో యువతి పేరిట నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.
అలాగే నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పలువురిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ మోసం చేశాడు. ఒక బాధితుడిని నిందితుడు రూ.11 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మోసం చేయడానికి వందలాది అక్రమ సిమ్ కార్డులను సేకరించి ఫేక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు.