థాంక్యూ ఫిల్మ్‌ఫేర్... బెస్ట్ యాక్టర్ అవార్డుపై అల్లు అర్జున్ స్పందన
- కొచ్చిలో ఘనంగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక
- 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక
- ఏడో ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవి రికార్డును సమం
- అభిమానులకు ఈ పురస్కారాన్ని అంకితమిచ్చిన అల్లు అర్జున్
ఈ పురస్కారం అందుకోవడంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "ఈ అద్భుతమైన గౌరవాన్ని అందించిన ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు. నన్ను ప్రత్యేకంగా అభిమానించే ఈ గడ్డపై అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి ఆశీర్వాదాలకు నేను వినమ్రతతో ఉన్నాను. నాపై అనంతమైన ప్రేమను కురిపిస్తున్న నా అభిమానులందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను" అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్‌కు ఇది ఏడో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కావడం విశేషం. దీంతో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన రికార్డును అల్లు అర్జున్ సమం చేశారు.