జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన యూత్ కాంగ్రెస్
- ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ తీరు సిగ్గుచేటన్న జగన్
- తండ్రి వైఎస్సార్ వారసత్వాన్ని కించపరచవద్దని హితవు పలికిన యూత్ కాంగ్రెస్
- సీబీఐ, ఈడీ కేసుల వల్లే రాజీ పడుతున్నారా అని ప్రశ్న
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన దేశానికి సిగ్గుచేటు తెచ్చిందని జగన్ విమర్శించారు. "రాజకీయ విభేదాలు ఏమున్నా, ప్రపంచం ముందు దేశ ప్రతిష్ఠను దిగజార్చే పనులు ఎవరూ చేయకూడదు. మనమంతా ఐక్యంగా నిలవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. "ప్రియమైన జగన్, మీ తండ్రి, మా గర్వకారణమైన నేత వైఎస్సార్ తన జీవితాన్ని మతతత్వ, విభజన శక్తులతో పోరాడటానికి అంకితం చేశారు. మీరు సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. కనీసం మీ తండ్రి వారసత్వాన్ని అయినా ఇంత బహిరంగంగా కించపరచవద్దు" అని యూత్ కాంగ్రెస్ ఓ ప్రకటనలో ఘాటుగా పేర్కొంది.