వెనెజువెలా చమురు కొనేందుకు రిలయన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా
- రిలయన్స్ తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకునే అవకాశం
- అధికారిక ప్రకటన విడుదల చేయని రిలయన్స్
- వెనెజువెలా చమురు రంగంపై ఆంక్షలను సడలిస్తున్న అమెరికా
కొన్ని రోజుల క్రితం వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆ దేశ చమురు రంగంపై ఆంక్షలు విధించింది. అనంతరం ఆ ఆంక్షలను సడలిస్తూ, అక్కడి చమురును విక్రయించేందుకు వ్యాపారులకు అనుమతులు ఇచ్చింది. అయితే, 2019-20లో అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడానికి ముందు కూడా రిలయన్స్ వెనెజువెలా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేది.