మధిర మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు
- 10వ వార్డు నుంచి బోడేపూడి రేవతి విజయం
- మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా
- పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 చోట్ల విజయం సాధించారు.
ఇప్పటి వరకు పలు మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. అశ్వారావుపేట, పెద్దపల్లి, కామారెడ్డి, భీంగల్, మరిపెడ, చండూరు, చొప్పదండి, రామాయంపేట, బాన్సువాడ, హాలియాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేటలో 22 వార్డులకు గాను 17 స్థానాల్లో కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్, ఒకచోట బీజేపీ విజయం సాధించాయి. హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలిచింది.