బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య
- మైమెన్ సింగ్ జిల్లాలో నిన్న రాత్రి దారుణ హత్య
- 62 ఏళ్ల సుషేన్ చంద్రను హత్య చేసిన దుండగులు
- పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారన్న పోలీసులు
రాత్రి 11 గంటల సమయంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారని... ఆ సమయంలో సుషేన్ తన దుకాణంలోనే ఉన్నాడని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత హంతకులు షట్టర్ దించి, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారని తెలిపారు. హంతకుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్యను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.