బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు ఆ మంత్రి బెదిరింపులే కారణం: రామచందర్ రావు
- మక్తల్ లో మహదేవప్ప ఆత్మహత్య కలచివేసిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- కాంగ్రెస్ అహంకారపూరిత రాజకీయాలే కారణమని ఫైర్
- నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. మంత్రి శ్రీహరిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని అన్నారు. మహదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని రామచందర్ రావు స్పష్టం చేశారు.