పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
- ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్
- సరైన ఆధారాలు లేవని పేర్కొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్
- సంజయ్ పై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధికార కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన స్పీకర్.. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.