ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో సజ్జల, బొత్స కీలక భేటీ
- అంబటి అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు
- తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న సజ్జల, బొత్స
- వాప్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఇటీవల చోటు చేసుకుంటున్న అంశాలపై పార్టీ నేతలు ఎలా స్పందించాలనే అంశంపై సజ్జల, బొత్స సూచనలు చేశారు.
తిరుమల ప్రతిష్ఠ దిగజార్చే విధంగా కూటమి వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను నిలువరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీ నేతలకు భద్రత కల్పించేందుకు పోరాటం చేయాలని తెలిపారు.