బడ్జెట్ ఎఫెక్ట్... 2,300 పాయింట్ల భారీ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్
- ఒక దశలో సెన్సెక్స్ 2,300 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు
- ప్రారంభంలో పెట్టుబడిదారులకు రుచించని బడ్జెట్
- ప్రసంగం అనంతరం కోలుకున్న స్టాక్ మార్కెట్
ప్రారంభంలో బడ్జెట్ ప్రసంగం రుచించని ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత వివిధ అంశాలు కాస్త సానుకూలంగా ఉండటంతో నష్టాలు మధ్యాహ్నం 1 గంటల సమయానికి సగానికి పైగా తగ్గాయి. సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి.
మధ్యాహ్నం 12.53 గంటలకు సెన్సెక్స్ 1,174 పాయింట్లు క్షీణించి 81,392 వద్ద, నిఫ్టీ 399 పాయింట్లు పడిపోయి 25,019 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం 1.00 గంటకు సూచీలు కాస్త కోలుకుని సెన్సెక్స్ 1,053 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్ల క్షీణతతో కదలాడుతున్నాయి.