ఫాంహౌస్ లో కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్
- ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కొనసాగుతున్న భేటీ
- మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై కొనసాగుతున్న చర్చ
- నిన్న కేసీఆర్ తో భేటీ అయిన హరీశ్ రావు
కేసీఆర్ కు అందిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై నిన్న హరీశ్ తో, ఈరోజు కేటీఆర్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలి, మీడియా ముందుకు ఎలాంటి అంశాలను తీసుకెళ్లాలనే అంశాలపై చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గించాలనే పట్టుదలతో ఉంది.