ప్రభాస్ పెళ్లయిన 12 గంటల తర్వాత నా పెళ్లి: నవీన్ పొలిశెట్టి
- ప్రభాస్‌ను ఉటంకిస్తూ తన పెళ్లిపై నవీన్ తనదైన స్టైల్లో సమాధానం
- 'అనగనగా ఒక రాజు' చిత్రంతో సరికొత్త పాత్రలో కనిపించబోతున్న నవీన్
- మెగాస్టార్ చిరంజీవితో పోటీ లేదని స్పష్టీకరణ
వరుస హిట్లతో దూసుకుపోతున్న నవీన్.. ఈ చిత్రంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు తెలిపారు. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దగ్గర నుంచి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వరకు నేను చేసిన ప్రతి పాత్ర భిన్నమైనదే. ఇప్పుడు ఈ సినిమాలో గోదావరి జిల్లాల వెటకారం కలగలిసిన కొత్త తరహా పాత్రలో కనిపిస్తా. ఇది చూస్తున్నప్పుడు నా పాత సినిమాలు ఏవీ మీకు గుర్తుకు రావు" అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీపై స్పందిస్తూ.. "మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎందరో మధ్యతరగతి కుర్రాళ్లకు స్ఫూర్తి. ఆయన బాటలోనే మేము ఇక్కడి వరకు వచ్చాం. గురువుగారి సినిమాతో పాటు మా సినిమా రావడం ఒత్తిడిని కాదు, ఉత్సాహాన్ని ఇస్తుంది" అని చెప్పాడు. ముంబైలో పెళ్లిళ్లకు హోస్ట్‌గా పనిచేసిన గతాన్ని గుర్తు చేసుకుంటూ.. కష్టపడి పైకి వచ్చిన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నవీన్ పొలిశెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు.