ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో?: కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
- ప్రజలకు మొహం చూపించలేక ఫామ్ హౌస్ లో పడుకున్నారన్న ఎంఎస్ రాజు
- మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
- బీఆర్ఎస్ పూర్తిగా బలహీనమయిందని వ్యాఖ్య
ఈ వ్యాఖ్యలపై మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. ప్రజలకు మొహం చూపించలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ కామెంట్ చేశారు. సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ ను కేసీఆర్ అసమర్థుడిగా భావిస్తున్నారని... కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడానికి ఇదే కారణమని చెప్పారు. బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని... పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు.