గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
- ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
- ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయం
- వడ్డీ రేటు 7.15 శాతానికి తగ్గిస్తూ ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్ణయం
ఈ మేరకు ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఎండీ అండ్ సీఈవో త్రిభువన్ అధికారి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఆర్బీఐ 125 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించిందని తెలిపారు. ఇది గృహ రుణాలు తీసుకునే వారికి కొంత భారం తగ్గిస్తుందని ఆయన అన్నారు. 2026లోకి అడుగుపెట్టనున్న ఈ సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపు గృహ రుణాల డిమాండ్‌కు ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐ ఇటీవల రెపో రేటు తగ్గించిన తరువాత పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ క్రమంలో ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ కూడా రుణ గ్రహీతలకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.