'అఖండ 2' సక్సెస్.. వారణాసిలో బాలయ్య, బోయపాటి ప్రత్యేక పూజలు
- 'అఖండ 2' సినిమా ఘన విజయం
- వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం
- సంప్రదాయ పట్టువస్త్రాల్లో కనిపించిన బాలకృష్ణ, బోయపాటి
సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ పర్యటనలో బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
డిసెంబర్ 12న విడుదలైన 'అఖండ 2' చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హిందుత్వం, ఆధ్యాత్మికత నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించారు.