జమలపూర్ణమ్మను పరామర్శించిన జగన్
- విజయవాడలో పర్యటించిన జగన్
- అనారోగ్యంతో బాధపడుతున్న జమలపూర్ణమ్మ
- పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జగన్
నగరంలోని కేదారేశ్వరపేటలో ఉన్న జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన జగన్, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని స్థానిక పార్టీ నాయకులను ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తమ నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు.