నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు
- అభిమాని హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ తూగుదీప
- కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేసిన సుప్రీంకోర్టు
- నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదన్న ధర్మాసనం
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "బెయిల్ మంజూరు, రద్దు అంశాలను మేం పరిశీలించాం. ఈ కేసులో హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం వల్ల విచారణపై ప్రభావం పడుతుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది" అని జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో జస్టిస్ మహదేవన్ రాసిన తీర్పును జస్టిస్ పర్దివాలా కొనియాడారు. "జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇది అనిర్వచనీయం. నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది" అని పేర్కొన్నారు.