'కాంతార' టీమ్ లో మరో వ్యక్తి మృతి
- 'కాంతార చాప్టర్ 1' షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస విషాదాలు
- తాజాగా నటుడు ప్రభాకర్ కళ్యాణి మృతి
- గుండెపోటుతో మృతి చెందిన ప్రభాకర్
కొన్ని రోజుల క్రితం ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో, చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన బాగానే ఉన్నప్పటికీ, హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.
గత నవంబర్ లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న వ్యాన్ కి ప్రమాదం జరిగి చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) నదిలో మునిగి ప్రాణాలు విడిచాడు. అనంతరం హాస్యనటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇలా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.